Olympics : పతకం లేకుండానే వెనుదిరిగి పీవీ సింధూ

ఒలింపిక్స్ లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న పీవీ సింధూ నిరాశ మిగిల్చింది.

Update: 2024-08-02 02:27 GMT

ఒలింపిక్స్ లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న పీవీ సింధూ నిరాశ మిగిల్చింది. పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఎలాంటి పతకం సాధించకుండానే వెనుదిరిగింది. 2016, 2020లో పతకాలను గెలుచుకుని దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2016లో రజతం, 2020 లో కాంస్యం పతకాన్ని సాధించిన పీవీ సింధూ ఈసారి ఒలింపిక్స్ లో మాత్రం ఒట్టి చేతులతోనే భారత్ కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రీక్వార్టర్ మ్యాచ్ లో...
నిన్న రాత్రి జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్ లో చైనా షట్లర్ హే బింగ్ జావ్ చేతిలో ఓటమి పాలు కావడంతో పీవీ సింధూ ఇంటి దారి పట్టక తప్పలేదు.నిజానికి పీవీ సింధూపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక పతకం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో సింధూ ఈ ఏడాది ఒలింపిక్స్ లో ఎలాంటి పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.


Tags:    

Similar News