PV Sindhu ParisOlympics: మొదలైన సింధు మెడల్ వేట
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత షట్లర్ పివి సింధు
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత షట్లర్ పివి సింధు ఒలింపిక్స్ తొలి రౌండ్ లో విజయాన్ని అందుకుంది. మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్‌పై వరుస గేమ్‌ల విజయంతో పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ వేటను మొదలుపెట్టింది. మూడో ఒలింపిక్ పతకం కోసం బరిలో దిగిన సింధు గ్రూప్ మ్యాచ్‌లో 21-9 21-6తో విజయాన్ని అందుకుంది. తక్కువ ర్యాంక్ ఉన్న ప్రత్యర్థికి ఓటమి రుచి చూపించడానికి కేవలం 29 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. సింధు 29 నిమిషాల్లోనే వరుసగా రెండు గేమ్ లలో మాల్దీవ్స్ క్రీడాకారిణిని చిత్తు చేసింది. రెండు సెట్లలో 21-9, 21-6 తేడాతో సింధు విజయం సాధించింది.
2016లో రియో గేమ్స్‌లో రజత పతకం, టోక్యోలో జరిగిన గత ఎడిషన్‌లో కాంస్యం సాధించిన 10వ సీడ్ సింధు.. బుధవారం జరిగే తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ప్రపంచ 75వ ర్యాంకర్ ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కుబాతో తలపడనుంది.