తప్పంతా తన మీద వేసుకున్న శుభమన్ గిల్

ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు తరఫున

Update: 2023-09-16 10:18 GMT

ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు తరఫున వీరోచితంగా పోరాడాడు శుభ్ మన్ గిల్. సూపర్ 4లో భారత్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలవడం ద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆఖరి సూపర్ 4 మ్యాచ్ లో మాత్రం బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఓటమికి కారణాన్ని తన మీదనే వేసుకున్నాడు శుభమన్ గిల్. మ్యాచ్ అనంతరం మీడియాతో గిల్ మాట్లాడుతూ ‘‘కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎంతో అడ్రెనలిన్ ఉంటుంది. దాంతో అంచనాలు తప్పుతాయి. ఇది నా వైపు నుంచి జరిగిన అంచనా విషయంలో తప్పు. నేను అవుటైనప్పుడు ఇంకా ఎంతో సమయం మిగిలి ఉంది. నేను ఆ సమయంలో దూకుడుగా బ్యాటింగ్ చేయకపోతే విజయాన్ని సాధించి ఉండే వాళ్లం. కానీ, ఇవన్నీ అనుభవాలు. అదృష్టం ఏమిటంటే అది ఫైనల్ గేమ్ కాదు’’ అని గిల్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సమయంలో జరిగిన పొరపాట్లపై స్పందించారు. ‘‘భవిష్యత్ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు తమ ప్రతిభ చూపించేందుకు కొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఆడే అవకాశం కల్పించాలని అనుకున్నాం’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు సత్తా చాటలేకపోయారు. తెలుగోడు తిలక్ వర్మ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.


Tags:    

Similar News