బీసీసీఐ నుంచి గంగూలీ అవుట్
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీ కాలం ఈనెల 18వ తేదీతో పూర్తి కానుంది
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీ కాలం ఈనెల 18వ తేదీతో పూర్తి కానుంది. తదుపరి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ బాధ్యతలను చేపట్టనున్నారు. గంగూలీ బీసీసీఐ నుంచి తప్పుకునే సమయం వచ్చింది. మూడేళ్ల పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగారరు. ఆయన ఐసీసీ బాధ్యతలను తీసుకునేందుకు ముందుకు రాలేదు. మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టాలని భావించినా అది కుదరలేదు.
తదుపరి అధ్యక్షుడిగా....
తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నారు. ఈ నెల 18న ముంబయిలో జరగనున్న వార్షిక సమావేశంలో 36వ బీసీసీ అధ్యక్షుడగా బిన్నీ బాధ్యతలను చేపట్టనున్నారు. జై షా మాత్రం రెండో సారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు.ఐపీఎల్ ఛైర్మన్ పదవిని కూడా గంగూలీ తిరస్కరించారు. బీజేపీలో చేరకపోవడంతోనే గంగూలీకి బీసీసీఐ పదవి రెన్యువల్ కాలేదన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. బెంగాల్ ఎన్నికలు పూర్తి కావడంతోనే గంగూలీని పక్కన పెట్టారని విమర్శలు చేసింది. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని పేర్కొంది.