50 ఓవర్లలో 5 వికెట్ల నష్టాని​కి 416 పరుగులు

సౌతాఫ్రికా జట్టు బ్యాట్ తో విధ్వంసం సృష్టిచింది. సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న

Update: 2023-09-16 02:11 GMT

సౌతాఫ్రికా జట్టు బ్యాట్ తో విధ్వంసం సృష్టిచింది. సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ కేవలం 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 రన్స్ చేశాడు. రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేయగా.. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌ 45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 నాటౌట్‌ చెలరేగిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టాని​కి 416 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్క్రమ్‌ (8) మినహా అందరూ రాణించారు. క్వింటన్‌ డికాక్‌ (45), రీజా హెండ్రిక్స్‌ (28) పర్వాలేదనిపించారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ కేవలం 57 బంతుల్లో శతకం సాధించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన సెంచరీ. గతంలో క్లాసెన్‌ 54 బంతుల్లోనే శతకం బాదాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ రికార్డు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 10 ఓవర్లలో 113 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక ఛేజింగ్ లో ఆస్ట్రేలియా ఎటువంటి సంచలనం సృష్టించలేదు. 34.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 164 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అలెక్స్ కేరీ 99 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీని చేజార్జుకున్నాడు. టిమ్ డేవిడ్ 35 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. లుంగి ఎంగిడి 4 వికెట్లతో, రబాడా 3 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు.


Tags:    

Similar News