బంగ్లాదేశ్ కు భారీ ఓటమి
వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు మరో పరాజయం ఎదురైంది. బంగ్లాదేశ్ మీద దక్షిణాఫ్రికా జట్టు
వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు మరో పరాజయం ఎదురైంది. బంగ్లాదేశ్ మీద దక్షిణాఫ్రికా జట్టు 149 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 140 బంతుల్లోనే 174 పరుగులు చేశాడు. క్లాసన్ 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 49 బంతుల్లోనే 90 పరుగులు చేయగా.. మిల్లర్ 15 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ తో 34 పరుగులు చేసాడు. కెప్టెన్ మార్కరం 60 పరుగులు చేసాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమ్మద్ రెండు వికెట్లు తీసుకోగా.. షకీబ్, షరిఫుల్ ఇస్లాం, మెహదీ హాసన్ మిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో బంగ్లా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 233 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మద్దుల్లా వీరోచిత శతకం(111) చేశాడు. మిగిలిన ఆటగాళ్లెవరూ పెద్దగా రాణించకపోవడంతో బంగ్లా భారీ ఓటమిని అందుకుంది. సఫారీ బౌలర్లలో కొయెట్జ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రబడా, జాన్సెన్, విలియమ్స్ కి తలో రెండు వికెట్లు దక్కాయి. బుధవారం నాడు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ తో తలపడనుంది.