కావ్య ఏడుపు చూడలేకపోతున్నా: రజనీకాంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్ని సీజన్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన చేస్తూ వస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'జైలర్'. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఓడిపోతూ ఉంటే కావ్య మారన్ బాధపడుతూ ఉండడాన్ని తాను చూడలేకపోతున్నానని రజనీకాంత్ అన్నారు. ఆమెను బాధపెట్టకుండా వచ్చే సీజన్ లో అయినా మంచి ఆటగాళ్లను తీసుకోవాలని తలైవా సూచించారు. జైలర్ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. SRH జట్టు యజమాని కావ్య మారన్, IPL మ్యాచ్‌ల సమయంలో తన జట్టు ఓడిపోవడాన్ని చూస్తున్నప్పుడు బాధపడుతూ ఉండడాన్ని తాను చూడలేకపోతున్నానని రజినీకాంత్ ఆందోళన చెందారు. జట్టులో మెరుగైన ఆటగాళ్లను తీసుకోవాలని కావ్య తండ్రి కళానిధి మారన్‌కు తలైవా సలహా ఇచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్ని సీజన్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన చేస్తూ వస్తోంది. ఐపీఎల్ 2023లో14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని సన్ రైజర్స్ జట్టు ఈ ఏడాది కూడా పెద్ద పోటీ ఇవ్వలేకపోయింది. కొంతమంది పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ పెద్దగా రాణించలేదు. SRH టీమ్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్ లాంటి స్టార్స్ ను వదులుకొని పెద్ద తప్పు చేసిందని నిందిస్తూ వస్తున్నారు. ఇవన్నీ కావ్య తీసుకున్న నిర్ణయాలే అని కూడా అంటుంటారు. ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచకుండా మారుస్తూ వెళితే ఫలితాలు ఇలానే ఉంటాయని విమర్శలు ఎదుర్కొంటూ ఉంది సన్ రైజర్స్.