ఈ వరల్డ్ కప్ లో తొలి సెంచరీ నమోదు..!

Update: 2022-10-27 04:59 GMT

టీ20 ప్రపంచ కప్ లో తొలి సెంచరీ నమోదైంది. సిడ్నీ వేదికగా బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతూ ఉన్నాయి. వన్ డౌన్ లో వచ్చిన రైలీ రుసోవ్ 52 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో మొదటి సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ లోనే దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోగా ఆ సమయంలో వచ్చిన రైలీ రుసోవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇండోర్ లో భారత్ మీద సెంచరీ బాదిన రైలీ రుసోవ్.. ఇప్పుడు బంగ్లాదేశ్ పై కూడా సెంచరీ బాదాడు.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఓపెనర్ బావుమా ఆరు బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన రైలీ రుసోవ్ మరో ఓపెనర్ డికాక్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 168 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాక డికాక్ 38 బంతుల్లో 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రైలీ రుసోవ్ తన సెంచరీని పూర్తీ చేసుకున్నాడు. రైలీ రుసోవ్ సెంచరీలో 7 ఫోర్లు.. 7 సిక్సర్లు ఉన్నాయి.
ట్రిస్టన్ స్టబ్స్ 7, అయిడిన్ మార్క్‌రమ్ 10 పరుగులు చేసి అవుట్ కాగా 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 109 పరుగులు చేసిన రిలీ రోసోవ్‌ని షకీబ్ అల్ హసన్ పెవిలియన్ చేర్చాడు.15 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన సౌతాఫ్రికా... ఆఖరి 5 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది..


Tags:    

Similar News