ఘనంగా సాగిన తాళ్లచెరువు క్రిస్మస్ స్పోర్ట్స్ కార్నివాల్

తాళ్లచెరువులో క్రీడా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి

Update: 2024-01-02 14:13 GMT

thallacheruvu christmas sports carnival news update        

తాళ్లచెరువులో క్రీడా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు టోర్నమెంట్ ను స్పాన్సర్‌ చేయగా.. ఫాదర్ పుట్టి ఆంథోని రాజు, గ్రామ అధ్యక్షుడు అర్లా రెడ్డి, గ్రామ పెద్దలు స్పిన్నర్ బాల షోరెడ్డి తదితరులు దగ్గరుండి ప్రోత్సహించారు. వాలీ బాల్ పోటీల్లో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. మొదటి స్థానంలో రాజా అండ్ టీమ్ నిలవగా.. రన్నర్ గా పవన్ అండ్ టీమ్ నిలిచిందఇక క్రికెట్ టోర్నమెంట్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం తొమ్మిది జట్లు లీగ్ టోర్నమెంట్ లో భాగమయ్యాయి. సూపర్ సిక్స్ కు TLC ఇన్విన్సిబుల్స్, AGM ఫైటర్స్, వేళాంగిణి మాతా ఛాంపియన్స్, సూపర్ థండర్స్, రైజింగ్ ఈగల్స్, డామినేటర్స్ చేరాయి. మొదటి సెమీస్ మ్యాచ్ TLC ఇన్విన్సిబుల్స్ vs AGM ఫైటర్స్ మధ్య.. రెండో సెమీస్ వేళాంగిణి మాతా ఛాంపియన్స్ vs రైజింగ్ ఈగల్స్ మధ్య సాగింది. ఫైనల్ లో వేళాంగిణి మాతా ఛాంపియన్స్, TLC ఇన్విన్సిబుల్స్ జట్లు అడుగుపెట్టాయి. TLC ఇన్విన్సిబుల్స్ జట్టు 16 పరుగులతో తేడాతో ఫైనల్ లో విజయాన్ని అందుకుంది.


TLC ఇన్విన్సిబుల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 15 ఓవర్లలో 124 పరుగులు చేయగా.. వేళాంగిణి మాతా ఛాంపియన్స్ జట్టు 108 పరుగులకు పరిమితమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ద సిరీస్ గా కిరణ్ కుమార్ రెడ్డి తుమ్మాకు ట్రోఫీని అందించారు. అత్యంత విలువైన ఆటగాడు, సిరీస్‌లో అత్యుత్తమ బౌలర్ గా తేజా రెడ్డి నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా సైదా రెడ్డి నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా పి ఇంద్ర సేన రెడ్డికి లభించింది.బ్యాడ్మింటన్ డబుల్స్లో 12 జట్లు పోటీ పడ్డాయి. గాదె సుధాకర్ రెడ్డి, వెంకటరావు డబుల్స్ టైటిల్ గెలిచారు. రన్నరప్ గా నెక్కంటి అశోక్ రెడ్డి, సైదా రెడ్డి నిలిచారు. టోర్నమెంట్ ఎంతో అద్భుతంగా సాగిందని.. స్పోర్ట్స్ కమిటీ మెంబెర్స్ అశోక్, దొండేటి జగదీశ్, జంగం రాజ శేఖర్ తెలుగుపోస్టుతో తెలిపారు.


  


Tags:    

Similar News