Hardik Pandya: స్పిన్నర్ గా మారిన హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా అంటే చాలు విధ్వంసకర బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్

Update: 2024-07-27 08:05 GMT

హార్దిక్ పాండ్యా అంటే చాలు విధ్వంసకర బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్ మనకు గుర్తుకు వస్తుంది. అలాంటిది ఎప్పుడైనా స్పిన్నర్ గా మారుతాడని మనం ఊహించామా? లేదా లెగ్ స్పిన్ వేస్తాడని అసలు అనుకున్నామా? అయితే శ్రీలంకలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా స్పిన్నర్ గా అవతారమెత్తాడు.

శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లెగ్ స్పిన్‌ వేశాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన హార్దిక్ లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగల తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. LSG జట్టు అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే హార్దిక్‌తో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. హార్దిక్‌, కుంబ్లే బౌలింగ్‌ యాక్షన్‌ల మధ్య ఉన్న సారూప్యతను చూపించారు.
T20Iల నుండి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత.. BCCI సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీని అప్పగించింది. టీ20లు, వన్డేలు రెండింటిలోనూ వైస్ కెప్టెన్‌ను హార్దిక్ పాండ్యా నుండి శుభమాన్ గిల్‌ కు ఇచ్చేశారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ లో టీమ్ ఇండియా కొత్త శకాన్ని ప్రారంభించనుంది. జూలై 27, శనివారం సిరీస్ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు భారత T20I జట్టు శ్రీలంకలోని పల్లెకెల్లె చేరుకుంది. ఆగస్టు 2 నుంచి వన్డేలు జరగనున్నాయి.



Tags:    

Similar News