క్లీన్ స్వీప్ కోసం ఇండియా.. పరువు కోసం కివీస్
భారత్ - న్యూజిలాండ్ మధ్య ఈరోజు మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లో మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది
భారత్ - న్యూజిలాండ్ మధ్య ఈరోజు మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది. మూడో మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఇప్పటికే రెండు వన్డేలను గెలిచిన భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది. శ్రీలంక తరహాలోనే న్యూజిలాండ్ పై కూడా క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది.
స్వల్ప మార్పులతో...
మరోవైపు భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షమికి విశ్రాంతి ఇచ్చి ఆయన స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇవ్వనున్నారు. కులదీప్ స్థానంలో చాహల్ దిగే అవకాశముంది. మిగిలిన జట్టంతా యధాతధంగా ఉంటుందని చెబుతున్నారు. న్యూజిలాండ్ కూడా చివరి మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఆ జట్టులో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇండోర్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలమైనది కావడంతో పరుగులు ఏ స్థాయిలో ఉంటాయన్నది చెప్పలేమంటున్నారు క్రీడా విశ్లేషకులు.