రేపటి నుంచి క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే
రేపటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ తో టీ 20 మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది
రేపటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ తో టీ 20 మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత్ తన జట్టును ప్రకటించింది. పదహారు మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి భారత్ లో జరిగే ఈ సిరీస్ ఎవరి సొంతమవుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీ 20లలో యువ జట్టు ఇటీవల దక్షిణాఫ్రికాలో సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈసారి భారత్ లో ఆఫ్ఘనిస్థాన్ పై సిరిస్ ను గెలుచుకుంటుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.
రోహిత్ నాయకత్వంలో...
చాలా రోజుల తర్వాత టీ 20 జట్టుకు రోహిత్ శర్మ టీ 20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్‌లలో ఒకరు ఓపెనర్ గా రోహిత్ తో కలసి బరిలోకి దిగనున్నారు. అయితే ఎవరెవరికి జట్టులో స్థానం దక్కుతుందన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. విరాట్ కొహ్లి రావడంతో తిలక్ ఆడతాడా? పక్కన పెడతారా? అన్న సందిగ్దం నెలకొంది. ఈ మూడు మ్యాచ్‌లలో జట్టు కూర్పుపై అనేక అంచనాలు వినపడుతున్నాయి.