IPL AUCTION 2022 : శార్దూల్ ఠాకూర్ కోసం పోటీపడుతున్న మూడు ఫ్రాంచైజీలు

ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో.. మూడు టీమ్ లు శార్దూల్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నాయి.

Update: 2022-02-05 07:47 GMT

శార్దూల్ ఠాకూర్.. గత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి, ఈ సీజన్ లో మెగా వేలంలో బరిలోకి దిగనున్నాడు. 2015లో కింగ్స్ XI పంజాబ్ తరపున మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ కి బదిలీ అయ్యాడు. ఆ తర్వాత 2018లో వేలంలో పాల్గొని.. రూ.2.5 కోట్లకు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కింద ఆడాడు.

శార్దూల్ ఠాకూర్ ఆట తీరు.. భారత జట్టులో స్థానాన్ని సంపాదించి పెట్టింది. ప్రస్తుతం శార్దూల్ టీమిండియాలో ఆల్ రౌండర్ గా, గేమ్ ఛేంజర్ గా మారాడు. T20 ఫార్మాట్‌ లో కీలక సమయాల్లో వికెట్లు తీస్తుంటాడు శార్దూల్. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో.. మూడు టీమ్ లు శార్దూల్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నాయి. వాటిలో ఒకటి ముంబై ఇండియన్స్. ఈ ఫ్రాంచైజీ శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రీమియం బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌ వంటి ప్లేయర్స్ ఉన్నారు. వారితి తోడు శార్దూల్ కూడా జట్టులోకి వస్తే.. కీలకమైన వికెట్లు తీయడానికి ప్లస్ పాయింట్ అవుతుంది.
ఇక రెండవది పంజాబ్ కింగ్స్. 2008, 2014 సీజన్లలో అర్హత సాధించిన ఈ జట్టు.. తిరిగి 2020లో పునరుద్ధరించబడింది. గత రెండు సీజన్లపై పంజాబ్ కింగ్స్ ఆశలు పెట్టుకుంది కానీ.. కప్ కొట్టడంలో ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం ఈ టీమ్ మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌ లను జట్టులో ఉంచుకుంది. టీమ్ ప్రధాన బౌలర్ అయిన మహమ్మద్ షమీ జట్టు వదిలి బయటికి రాగా.. శార్దూల్ ను కొనుగోలు చేయాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ వద్ద నికరంగా రూ.72 కోట్లు ఉండటంతో.. శార్దూల్ ను వేలంలో దక్కించుకునేందుకు వెనుకాడరని తెలుస్తోంది.
శార్దూల్ కోసం పోటీ పడుతున్న మూడవ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కే ఫ్రాంచైజీ వేలంలో ఆటగాళ్లను ఆచితూచి ఎంచుకుంటుంది. జట్టుకోసం కష్టపడే ఆటగాళ్ల కోసం సీఎస్కే వెతుకుతుంటుంది. కెప్టెన్ గా ఉన్న ఎంఎస్ ధోనీ.. జట్టులో అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాడు. శార్దూల్ ఈ జట్టులో 2018 నుంచి ఆడుతున్నాడు. ఇప్పటివరకూ ఈ జట్టు తరపున ఆడిన మ్యాచ్ లలో 55 వికెట్లు తీశాడు. CSK ఇప్పటికే తమ ఆల్ రౌండర్లైన రవీంద్ర జడేజా, మొయిన్ అలీని రిటైన్ చేసుకుంది. ఈ ఏడాది శార్దూల్ మెగా వేలంలోకి రావడంతో.. తిరిగి జట్టులోకి తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.


Tags:    

Similar News