తెలుగోడికి ఆసియా కప్ లో ఛాన్స్.. సంచలనాలు సృష్టిస్తాడా?

ఆసియా కప్ కు భారతజట్టును ప్రకటించారు. ఇందులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఉండడం

Update: 2023-08-21 08:35 GMT

ఆసియా కప్ కు భారతజట్టును ప్రకటించారు. ఇందులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఉండడం విశేషం. శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా ఎంపికయ్యారు. ఇద్దరూ గాయాల నుండి కోలుకున్నారు. చాలా సమయం నుండి ఆటకు దూరంగా ఉన్నారు. రెండు నెలల్లోపు ప్రపంచకప్‌ ఉండడంతో భారత్‌ మిడిల్‌ ఆర్డర్‌ ను సెట్ చేయడం కోసం వీరికి మంచి అవకాశమే..! అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌ను సంపాదించాడని భారత సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ధృవీకరించారు. రాహుల్ కు ఇంకాస్త సమయం ఇస్తామని.. అతడు ఆసియా కప్‌లో ఒకటి లేదా రెండు మ్యాచ్ కాను కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. సెలెక్టర్లు సంజూ శాంసన్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకున్నారు. వెస్టిండీస్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్ వర్మ 50 ఓవర్ల ఫార్మాట్‌లో స్థానం సంపాదించుకోవడం విశేషం. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా 17 మందితో కూడిన జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. T20I కెప్టెన్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

ఐర్లాండ్‌ సిరీస్ లో కెప్టెన్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ పేస్ అటాక్ లో ఉన్నారు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనబెట్టారు, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో పాటు కుల్దీప్ యాదవ్ స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు.
జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (విసి), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (బ్యాకప్)


Tags:    

Similar News