ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చిన తెలుగోడు

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దూసుకు వచ్చాడు.

Update: 2023-08-16 11:30 GMT

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దూసుకు వచ్చాడు. విండీస్ లో జరిగిన టీ20 టోర్నమెంట్ లో అరంగేట్రంలోనే అదరగొట్టాడు తిలక్ వర్మ. దీంతో అతడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించాడు. విండీస్‌ పర్యటనలో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన తిలక్‌ వర్మ (509) పాయింట్లతో 46వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం అతడి ఆటతీరును చూసి పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు. అతడిని రెగ్యులర్ గా ఆడించాలని.. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లో అతడికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్స్ కూడా బాగా పెరిగిపోయాయి.

ఐసీసీ టీ20 సూర్యకుమార్‌ యాదవ్ 907 పాయింట్లతో టీ20ల్లో తన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ ఏకంగా 43 స్థానాలను మెరుగుపర్చుకుని 25వ ర్యాంక్‌లో నిలిచాడు. టాప్‌ -10లో సూర్యకుమార్‌ మినహా మరే భారత క్రికెటర్‌కు చోటు దక్కలేదు. రెండో ర్యాంక్‌లో మహమ్మద్ రిజ్వాన్ (811) ఉన్నాడు. అయితే సూర్యకుమార్‌ తో అతడు ఎటువంటి పోటీలో లేడు. కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్ 395 పాయింట్లతో 88వ ర్యాంక్‌ సాధించాడు. టీ20ల్లో భారత జట్టు 264 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వన్డేల్లో భారత్‌ (113) మూడో స్థానంలోనే నిలిచింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా (118), ఆ తర్వాత పాకిస్థాన్‌ (116) ఉంది. వన్డే ఫార్మాట్‌లో శుభ్‌మన్‌ గిల్ (743 పాయింట్లు) ఐదో స్థానంలో, విరాట్ కోహ్లీ (705) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ (670) నాలుగు, కుల్‌దీప్‌ యాదవ్ (622) పదో స్థానంలో ఉన్నారు.


Tags:    

Similar News