ఆఫ్ఘనిస్థాన్ మీద విజయం.. ఆసియా కప్ లో భారత్ కుర్రోళ్ల దూకుడు
దుబాయ్‌లోని ఐసిసి అకాడమీలో అఫ్ఘనిస్థాన్ మీద ఏడు వికెట్ల తేడాతో
దుబాయ్‌లోని ఐసిసి అకాడమీలో అఫ్ఘనిస్థాన్ మీద ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం అందుకుంది. U19 ఆసియా కప్‌లో భారతజట్టు శుభారంభం సాధించింది. అర్షిన్ కులకర్ణి బ్యాట్, బాల్ తో రాణించాడు. అతను 8-0-29-3తో రాణించడంతో ఆఫ్ఘన్ జట్టును 173కి పరిమితం చేయడంలో సహాయపడింది. బ్యాటింగ్ లో 105 బంతుల్లో నాలుగు ఫోర్లతో అజేయంగా 70 పరుగులు చేశాడు అర్షిన్ కులకర్ణి. దీంతో భారత్ 12.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 50 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసి 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఓపెనర్ జంషీద్ జాద్రాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఆఫ్ఘన్ బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో పెద్దగా స్కోరు చేయలేకపోయింది ఆఫ్ఘన్ జట్టు. ఛేజింగ్ లో భారత్ 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. ముషీర్ ఖాన్ 48 నాటౌట్ తో కలిసి అర్షిన్ కులకర్ణి లక్ష్యాన్ని చేధించారు. ఇక భారత జట్టు తన తర్వాతి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడనుంది. ఆదివారం, డిసెంబర్ 10న ఉదయం 11 గంటలకు పాక్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.