గెలిచిన భారత జట్టు.. కానీ

తొలి వన్డేలో భారత జట్టు విండీస్ ను మట్టి కురిపించింది. ఈ మ్యాచ్ లో విండీస్ ఏ మాత్రం పోటీని

Update: 2023-07-28 01:14 GMT

తొలి వన్డేలో భారత జట్టు విండీస్ ను మట్టి కురిపించింది. ఈ మ్యాచ్ లో విండీస్ ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తొలివన్డేలో విండీస్‌ జట్టుపై టీమిండియా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్ లో విండీస్‌ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బ్యాటర్లలో షెయ్‌ హోప్‌ ఒక్కడే 43 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 1, ముఖేశ్ కుమార్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. కెప్టెన్ షాయ్ హోప్ కాకుండా అలిక్ అథనేజ్ 22, ఓపెనర్ బ్రాండన్ కింగ్ 17, షిమ్రోన్ హెట్మెయర్ 11 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ స్కోరుకు పెవిలియన్ చేరారు.

115 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ అర్థశతకంతో రాణించాడు. భారత్‌ కూడా లక్ష్యఛేదనలో కాస్త తడబడింది. విండీస్‌ స్పిన్నర్లు మోటీ, కరియన్‌లు బాగా బౌలింగ్ వేయడంతో భారత ఆటగాళ్లు కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లలో 52 పరుగులతో ఇషాన్‌ కిషన్ రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ 19, రవీంద్ర జడేజా 16 , రోహిత్ శర్మ 12 పరగులు చేశారు. హార్దిక్ పాండ్యా 5, శార్ధూల్ ఠాకూర్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తర్వాతి వన్డే ఇదే వేదికపై ఈ శనివారం జరగనుంది.


Tags:    

Similar News