టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగే తొలి వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. సోమవారం జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు తొలి అధికారిక వార్మప్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత భారత్ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. భారత్ కు ప్రధాన సమస్యగా మారిన డెత్ ఓవర్స్ బౌలింగ్ ఈ మ్యాచ్ లో ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లలో భారత్ స్వల్ప పురోగతిని సాధించింది, వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు ఐదు ఓవర్లలో 41 పరుగులు చేయగలిగింది. హర్షల్ పటేల్ బాగా బౌలింగ్ చేశాడు. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగే వార్మప్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తిరిగి రానున్నారు. ఇక సొంత గడ్డపై సత్తా చాటడానికి ఆస్ట్రేలియా కూడా ఎంతగానో ఉవ్విళ్లూరుతోంది.