ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మొదట మూడు వికెట్లు తీసి.. ఆ తర్వాత బ్యాటింగ్ లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ విరాట్ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని ఊహాగానాలు వచ్చాయి, అయితే మేనేజ్‌మెంట్ ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. ''మేము ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదు. టోర్నమెంట్ లో మరింత ముందుకు వెళ్లే అనుకూలత మాకుంది. విడిగా ఆటగాళ్లు అందరూ ఫామ్ లోకి రావాల్సి ఉంది''అని తెలిపారు. హార్దిక్ అన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాడు.. ఎవరికీ విశ్రాంతి ఇవ్వాలని మేము చూడటం లేదు, అతను మాకు ముఖ్యమైన ఆటగాడు, అతను బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు.. అలాంటి ఆటగాడికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు లేవని నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు మాంబ్రే బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు.