30lakh Duplicate Voters:తెలంగాణలో రెండున్నరేళ్లలో 30 లక్షల డూప్లికేట్‌ ఓటర్లు.. ఈసీ ఏం చేసిందంటే..

గత రెండున్నరేళ్లలో సుమారు 30 లక్షల డూప్లికేట్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర

Update: 2024-03-20 06:16 GMT

duplicate voters

30lakh Duplicate Voters:గత రెండున్నరేళ్లలో సుమారు 30 లక్షల డూప్లికేట్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. గత సంవత్సరం కూడా 8.58 లక్షల మంది ఇలాంటి ఓటర్లను సైతం తొలగించినట్లు చెప్పారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ ఓటర్లు పెరిగిపోతున్నారని, సొంతూళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో ఇలా నకిలీ ఓటర్ల సంఖ్య పెరుగుతోందన్నారు. ఓటర్‌ జాబితాను అప్‌డేట్‌ చేయడంతో నకిలీ ఓటర్లు బయటపడుతున్నాయని అన్నారు.

అయితే ఇలాంటి డూప్లికేట్ ఓటర్లకు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12.50 లక్షల మంది కొత్త ఓటర్లను నమోదు చేసుకోగా, 8.58 లక్షల మంది పేర్లను తొలగించారని సీఈఓ తెలిపారు. గతంలో 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసేందుకు సదుపాయాన్ని పొడిగించినట్లు తెలిపారు. 80 ఏళ్లు పైబడిన 1,94,082 మంది సీనియర్ సిటిజన్ ఓటర్లు, 5,26,340 మంది దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు.

Tags:    

Similar News