Telangana : నేడు ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష చేయనున్నారు

Update: 2024-12-23 02:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష చేయనున్నారు. సంక్రాంతి నాటికి లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నందున దీనిపై నేడు ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే గ్రామ కమిటీలలో లబ్దిదారుల ఎంపిక కు అంతా సిద్ధమయింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

భూ భారతికి...
దీనికి సంబంధించిన యాప్ కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఎంపికతో పాటు ఇళ్ల మంజూరును వీలయినంత త్వరగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించనున్నారు. తొలి విడత సొంత స్థలం ఉన్నవారిని ఎంపి చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు భూ భారతిపై కూడా అధికారులతో సమీక్ష చేయనున్నారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News