Tiger : ములుగు జిల్లాలో పెద్దపులి.. అలెర్ట్

తెలంగాణలోని ములుగు జిల్లాలో పులి సంచారం భయభ్రాంతులకు గురి చేస్తుంది.

Update: 2024-12-23 04:19 GMT

తెలంగాణలోని ములుగు జిల్లాలో పులి సంచారం భయభ్రాంతులకు గురి చేస్తుంది. ములుగు జిల్లాలో పులి సంచారాన్ని అధికారులు కనుగొన్నారు. నిన్న సాయంత్రం నీటి కొలను వద్ద కు పులి రావడాన్ని గమనించిన అధికారులు ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తం చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

గ్రామస్థులు వెళ్లకుండా...
పులి ఈ ప్రాంతంలో తిరుగుతుండటంతో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. గుంపులుగా ఉదయం పది గంటలు దాటిన తర్వాతనే పొలాలకు కానీ, అడవుల్లో కట్టెలకు గాని వెళ్లాలని, సాయంత్రం నాలుగు గంటలకల్లా తిరిగి వచ్చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పులి ఆ ప్రాంతంలోనే సంచరిస్తుండటంతో అధికారులు కూడా పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News