Revanth Reddy : అల్లు అర్జున్ ఇంటిపై దాడిపై రేవంత్ ఏమన్నారంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

Update: 2024-12-23 01:58 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులను ఖండిస్తున్నానని తెలిపారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ మేరకు తాను డీజీపీని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఎవరి ఇళ్లపైనా దాడులను తమ ప్రభుత్వం సహించబోదని రేవంత్ రెడ్డి అన్నారు.

శాంతి భద్రతల సమస్యపై...
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడుల చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డీజీపీ, పోలీస్ కమిషనర్ లను కోరారు. ఇక దీంతో పాటు సంథ్యా థియేటర్ ఘటనలో పాల్గొన్న పోలీసు సిబ్బంది కూడా స్పందించకుండా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. నిన్న సాయంత్రం ఓయూ జేఏసీ పేరుతో ఆరుగురు యువకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేశారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News