BJP : నేడు బీజేపీ కీలక సమావేశం
నేడు బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది.;

నేడు బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాననికి పార్టీ కీలక నేతలతో పాటు జిల్లా అధ్యక్షులు కూడా హాజరు కావాలని ఆహ్వానాలు పంపారు. వీరితో పాటు ఆఫీస్ కార్యవర్గ సభ్యులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు...
కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులతో తొలి సమావేశం కావడంతో పాటు ఈ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణపై చర్చ జరుగుతుంది. అదే సమయంలో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా అనే అంశంపై నేతలు చర్చించనున్నారు.