Telangana : నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

ఈరోజు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ మంత్రులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు;

Update: 2025-04-01 03:58 GMT
ministers,  delhi,  this evening, telangana
  • whatsapp icon

ఈరోజు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ మంత్రులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో రేపు జరిగే ధర్నా కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

బీసీలకు రిజర్వేషన్లు...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో దానిని అమలు చేయాలని కేంద్రంపై వత్తిడి చేసేందుకు ఢిల్లీకి వెళుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా జరుగుతుంది. ఈ ధర్మాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు పాల్గొంటారురు. పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ఆమోదించేలా వత్తిడి తేవాలని నిర్ణయించారు.ఎల్లుండి అన్ని పార్టీల నేతలను కలసి వినతి పత్రాలను సమర్పించనున్నారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించేందుకు రానున్నారు.


Tags:    

Similar News