అదిగో చిరుత పులి.. ఆదిలాబాద్ జిల్లాలో కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది.

Update: 2024-10-24 02:30 GMT

ఆదిలాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని బోధ్ మండంలోని చింతలబోరి గ్రామ శివారులో చిరుత పులి కనిపించింది. స్థానికుల కంట కనపడటంతో వారు భయాందోళనలు చెందుతున్నారు. ఒక మహిళ కంట ఈ చిరుత పులి కనిపించింద.ి. చింతగూడ పరిసర ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకు ఈ చిరుత పులి ఉండటాన్ని గమనించిన మహిళ అక్కడి నుంచి పరుగెత్తుకుని వచ్చి స్థానికులకు సమాచారం ఇచ్చింది.

పెద్దపులిని బంధించేందుకు...
స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత చింతగూడ గ్రామస్థులకు చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిరుత పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక ఎద్దుపై దాడి చేసి చింతగూడ ప్రాంతంలో చిరుత పులి చంపింది. దీంతో గ్రామస్థులు ఎవరూ రాత్రి వేళ ఒంటరిగా బయటకు రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News