టీకా వికటించి సౌదీలో యువకుడి నరకయాతన

టీకా వేయించుకుని తెలంగాణ నుంచి సౌదీకి వెళ్లిన యవకుడు ఒకరికి వైద్యం వికటించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు

Update: 2024-08-23 13:25 GMT

టీకా వేయించుకుని సౌదీకి వెళ్లిన యవకుడు ఒకరికి వైద్యం వికటించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. తనను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఈ మేరకు బాధితుడి తల్లి విదేశాంగ అధికారి పీఓఈకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.గల్ఫ్ కు వెళ్లే క్రమంలో హైదరాబాద్ లోని ఒక 'గల్ఫ్ మెడికల్ సెంటర్' లో వైద్య పరీక్షలతో పాటు, టీకా ఇంజక్షన్ వేయించుకుని 'ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తో సౌదీకి వెళ్లినజగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెమ్ గ్రామానికి చెందిన పోతుగంటి చంద్రశేఖర్ టీకా వికటించి అనారోగ్యం పాలయ్యాడు. అతను సౌదీలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యం పాలవడంతో భారత్ కు రపించాలని అతని తల్లి లక్ష్మి గురువారం హైదరాబాద్ విదేశాంగ శాఖ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

టీకా వికటించడంతో...
చంద్రశేఖర్ జూన్ 24న హైదరాబాద్ లోని ఎస్కే మెడికల్ సెంటర్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. జులై 11 నాడు ఉద్యోగ వీసాపై సౌదీ అరేబియాలోని అల్-బాద్, తాబూక్ కు వెళ్లి ఫ్యామ్కో కంపెనీ నియోమ్ ప్రాజెక్ట్ లో క్లీనింగ్ సూపర్ వైజర్ గా చేరాడు. టీకా ఇంజెక్షన్ వలన ఇన్ఫెక్షన్ తో కుడి భుజం గాయమై రక్తం కారుతున్నా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మెరుగైన చికిత్స కోసం తనను ఇండియాకు పంపించాలని చంద్రశేఖర్ కోరుతున్నాడు. ఈమేరకు తన ఉద్యోగానికి రాజీనామా కూడా సమర్పించాడు. సెప్టిక్ అయి భుజం తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని అతను ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.


Tags:    

Similar News