ప్రయాణికులకు అలర్ట్.. జులై 3 వరకూ 36 రైళ్లు రద్దు
జూన్ 25, 26 తేదీల్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు, జూన్ 24, 26 తేదీల్లో కాచిగూడ నుంచి రాయచూర్..
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. తెలంగాణలో 36 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. మరమ్మతులు, భద్రతా పరమైన కారణాలతో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది. జూన్ 25 నుంచి జులై 3 వరకూ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన రైళ్ల వివరాలిలా ఉన్నాయి.
జూన్ 25, 26 తేదీల్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు, జూన్ 24, 26 తేదీల్లో కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను రద్దు చేశారు. జూన్ 26 నుంచి జులై 3 వరకు కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూర్ టౌన్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. జూన్ 26 నుంచి జులై 2 వరకు కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.