కవిత ఇంటి దారులు మూసివేత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటి ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇవ్వడంతో కార్యకర్తలు ఎవరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆందోళనకు దిగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకూ పదకొండు మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించారు. కవితకు తాను బినామీ అని పిళ్లై పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ నేపథ్యంలో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. కవితను అరెస్ట్ చేస్తే ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.