Breaking : బీఎస్పీకి రెండు స్థానాలను కేటాయించిన కేసీఆర్
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్సీ పొత్తు ఖరారయింది. బీఎస్పీకి రెండు స్థానాలను కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారు
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్సీ పొత్తు ఖరారయింది. బీఎస్పీకి రెండు స్థానాలను కేటాయిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూలు, హైదరాబాద్ టిక్కెట్లను బీఎస్పీకి ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన పదిహేను స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలోకి దిగుతారు. ఇప్పటికే పదకొండు స్థానాలను ప్రకటించిన కేసీఆర్ మరో నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సాధరణ ఎన్నికల్లో తొలిసారి...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగి అత్యధిక స్థానాలను సాధించింది. నాడు అధికారంలో ఉండటంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి కూడా ఎక్కువ మంది నేతలు ముందుకు వచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనాలంటే బీఎస్పీతో పొత్తు అవసరమని భావించిన కేసీఆర్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. రెండు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు.