Breaking : అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్
హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ ను హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ ను హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ వైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపర్చగా ఆయనకు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. కేసును క్వాష్ చేయాలని న్యాయవాదులు వాదించారు.
సెక్షన్లు వర్తించవని...
రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం కాదంటూ అల్లు అర్జున్ తరుపున న్యాయవాది తన వాదనలను వినిపించారు. అల్లు అర్జున్ న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.