KCR : కేసీఆర్ పిటీషన్ పై తీర్పు రిజర్వ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులను కూడా రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈరోజు, రేపట్లో...
అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటిషన్‌కు విచారణకు అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి. నరసింహారెడ్డి కమిషన్ ఛైర్మన్ గా ఉంటూ మీడియాతో మాట్లాడి ముందుగానే తన అభిప్రాయాన్ని ప్రకటించినట్లయిందని కేసీఆర్ తరుపున న్యాయవాదులు తెలిపారు. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. ఈరోజు సాయంత్రం లేదా సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉందని న్యాయస్థానం వర్గాలు వెల్లడించాయి.