Arikepudi vs Kaushik Reddy: రెచ్చిపోతున్నారా? రెచ్చగొడుతున్నారా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి పై అరికెపూడి గాంధీ;

Update: 2024-09-12 07:55 GMT
ArikepudiVsKaushikReddy, Fight, KaushikReddy, padi kaushik reddy house, padi kaushik reddy home, Arikepudi Gandhi, telangana political news updates, BRS MLAs fight, brs latest news

 Arikepudi GandhiKaushikReddy

  • whatsapp icon
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి పై అరికెపూడి గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అరికెపూడి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

కౌశిక్ రెడ్డి సవాల్‌పై అరికెపూడి తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి కనుక సెప్టెంబర్ 10 గంటలకు తన ఇంటికి రాకపోతే తానే 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్తానన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారా? అని మీడియా ప్రశ్నించగా, అరికెపూడి గాంధీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని కలవడం సహజమే అన్నారు. తనకు కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేసీఆర్ తనకు ప్రాధాన్యతను ఇచ్చారని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామన్నారు. కానీ పార్టీలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారని మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు గమనించాలని గాంధీ కోరారు.

ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలను చూస్తుంటే కార్యకర్తలను ఇద్దరు నేతలు రెచ్చగొడుతున్నట్లే ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఆ నేతలు కూడా వాడడానికి వీలు లేని పదాలతో ప్రెస్ మీట్ లలో మాట్లాడుతూ ఉండడం అత్యంత దారుణమైన విషయం. రెచ్చిపోవడం.. రెచ్చగొట్టడం రెండూ ఈ తతంగంలో భాగమై ఉన్నాయి. పోలీసులు వీరిని కంట్రోల్ చేస్తారో లేదో చూడాలి.


Tags:    

Similar News