Bathukamma : వేడుకగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణలో గత మూడు రోజలుగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి

Update: 2024-10-04 02:07 GMT

bathukamma celebrations 2024

తెలంగాణలో గత మూడు రోజలుగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. దేవీ నవరాత్రులు కూడా ప్రారంభం కావడంతో ఇళ్లన్నీ శుభ్రం చేసుకుని, పూలను సేకరించి బతుకమ్మను పేర్చి సాయంత్రం అందరూ ఒకచోట చేరి బతుకమ్మ ఆడుతుండటం ప్రతి వీధిలో కనిపిస్తుంది.

ముద్దపప్పు బతుకమ్మ...
ఈరోజు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ వేడుకలను అధికారికంగా ప్రకటించడంతో పాటు నిధులను కేటాయించడంతో వాడవాడలా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలు చూసేందుకు రెండుకళ్లు చాలవు. దేశ, విదేశాల్లోనూ తమ సంప్రదాయాలను పోగొట్టుకోకుండా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు.
Tags:    

Similar News