Bhadrachalam : నీటమునిగిన భద్రాచలం

భద్రాచలం పట్టణం పూర్తిగా జలమయపోయింది. భారీ వర్షం కురవడంతో నీళ్లు నిలిచిపోయాయి

Update: 2024-08-08 02:13 GMT

భద్రాచలం పట్టణం పూర్తిగా జలమయపోయింది. భారీ వర్షం కురవడంతో నీళ్లు నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణంలో 6.8 సెంటీమీటర్ల వర్షం కురియడంతో పట్టణంలోని డ్రెయిన్లు ఉప్పొంగాయి. దీంతో భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. నడుముల్లోతు నీరు చేరింది. భద్రాచలం ఆలయం పడమర ఉన్న మెట్ల మార్గం నుంచి భక్తులు వెళ్లాలంటే నడుము లోతు నీరు చేరడంతో అనేక అవస్థలు పడ్డడారు.

ఆలయ పరిసర ప్రాంతాల్లోకి....
భద్రాచలం అన్నదాన సత్రం పరిసర ప్రాంతాల్లోకి కూడా నీరు చేరింది. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మురుగు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో భరించలేని దుర్వాసన వెలువడుతుంది. మోటార్లతో నీరు తోడించడంతో కొంత వరకూ సమస్య తీరినా వర్షం కురిసినప్పుడల్లా తమకు ఈ సమస్య ఏంటని భద్రాచలం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News