Munugode bypoll : ఈసీని కలిసిన బీజేపీ నేతలు
మునుగోడు ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను బీజేపీ నేతలు కోరారు
మునుగోడు ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను బీజేపీ నేతలు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కూడా ప్రత్యేకంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఆడియో టేపులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ డ్రామాకు టీార్ఎస్ తెరలేపిందని వారు ఫిర్యాదు చేశారు
కొనుగోలు వ్యవహారం...
న్యాయస్థానం కూడా నిందితులుగా పోలీసులు పేర్కొంటున్న వారికి రిమాండ్ విధించలేదన్న విషయాన్ని వారు ఈసీ దృష్టికి తెచ్చారు. ఆరోపణలు చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ భావిస్తుందని వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మరిన్ని అక్రమాలకు పాల్పడేందుకు అధికార టీఆర్ఎస్ సిద్ధమయిందని వారు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలను కూడా కోర్టుకు చూపలేక పోయారని, అవసర ఆరోపణలు చేసి బీజేపీని బద్నాం చేయడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.