Income Tax : మిర్యాలగూడలో ఐటీ సోదాలు

బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2023-11-16 03:39 GMT

బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు  అనుచరులు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్లగొండలోనే ముప్ఫయి బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నల్లమోతు భాస్కరరావు బంధువులు, అనుచరుల ఇళ్లపై ఈ సోదాలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాల పహారా మధ్య ఈ సోదాలు జరుగుతున్నాయి.

నగదు ఉందని...
పెద్దయెత్తున నగదు ఉందన్న సమాచారంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోసం భారీ ఎత్తున నగదును నిల్వ చేసినట్లు సమాచారం రావడంతోనే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. రైస్ మిల్లులతో పాటు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోకూడా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తన ఇళ్లలో ఎటువంటి సోదాలు జరగడం లేదని భాస్కర్ రావు తెలిపారు. 


Tags:    

Similar News