Breaking : రేవంత్ రెడ్డికి సొంత ఇలాకాలో తొలి షాక్.. బీఆర్ఎస్ దే గెలుపు

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

Update: 2024-06-02 04:59 GMT

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయిన కౌంటింగ్ తొలి దశలోనే కౌంటింగ్ ముగిసింది. దీంతో కౌంటింగ్ సెంటర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై నూట పదకొండు ఓట్లతో గెలుపొందారు.

కాంగ్రెస్ అభ్యర్థి...
కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో గత మార్చి 28వ తేదీన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. రెండు పార్టీలూ గెలుపు కోసం శ్రమించాయి. అయితే చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి 763 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఆయనకు ఒకరకంగా షాకింగ్ అనే చెప్పాలి.


Tags:    

Similar News