హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్ట్ పై హైకోర్టు స్టే విధించింది.
బీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్ట్ పై హైకోర్టు స్టే విధించింది. బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ఫిర్యాదుతో పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. దీనిపై హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు.
క్వాష్ పిటీషన్ పై...
తనపై నమోదయిన కేసును కొట్టివేయాలంటూ ఆయన క్వాష్ పిటీషన్ వేశారు. అయితే హైకోర్టులో దీనిపై విచారించిన న్యాయస్థానం హరీశ్ రావుకు ఊరట లభించేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన అరెస్ట్ పై స్టే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పోలీసుల ఈ కేసు విషయంలో తదుపరి విచారణ చేపట్టవచ్చని, ఆయనను అరెస్ట్ చేయకుండా విచారించవచ్చని, విచారణకు హరీశ్ రావు సహకరించాలని కోరింది.