Harish Rao : తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్
తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు
తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైడ్రా పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీలో చేరని నేతలపై హైడ్రాను ఉపయోగిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను కూల్చివేస్తామని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే దాడులు తప్పవని హెచ్చరించినట్లుందని హరీశ్ రావు అన్నారు.
అనేక సమస్యలున్నా...
రాష్ట్రంలో డెంగ్యూ, విషజ్వరాలతో జనం బాధపడుతుంటే వాటిని పట్టించుకోని ప్రభుత్వం కూల్చి వేతలతో వాటిని డైవర్ట్ చేయాలని చూస్తుందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పధకాలపై రైతులు ఆందోళనకు దిగకుండా ఇటువంటి చర్యలకు దిగుతుందని ఆయన ఆరోించారు. డెంగ్యూ కేసులపై ప్రభుత్వం కనీసం సమీక్షించిన దాఖలాలు లేవని హరీశ్ రావు అన్నారు. అనేక సమస్యలను పక్కదోవ పట్టించడానికే హైడ్రా ను ముందుపెట్టి ఈ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ఆయన అన్నారు.