‌Heavy Rains : నేడు కూడా భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది;

Update: 2024-09-22 03:55 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశముందని తెలిపింది. ఇరవై తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిన్న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. కుండపోత వర్షంతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో 29 జిల్లాల్లో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపిది. ప్రధానంగా మెదక్, మల్కాజ్‌గిరి, భువనిగిరి, ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూలు, జగిత్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, కొమురం భీం, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, భువనగిరి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భాారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లోనూ...
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావవరణం పేర్కొంది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎవరూ వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వరసగా భారీ వర్ష సూచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు.





Tags:    

Similar News