Telangana : నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన ఎక్కడెక్కడంటే?

నేడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-09-23 04:28 GMT

నేడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది.

హైదరాబాద్‌కు ఎల్లో అలెర్ట్...
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిసింది.


Tags:    

Similar News