కామారెడ్డిలో దారుణం.. డబ్బు కట్టలేదని వేసిన కుట్లు విప్పేసి?

కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. ఒక ప్రయివేటు ఆసుపత్రి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు

Update: 2024-09-23 07:11 GMT

 kamareddy

కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. ఒక ప్రయివేటు ఆసుపత్రి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రికి వచ్చిన యువకుడికి కుట్లు వేశారు. అయితే తన వద్ద మూడు వందల రూపాయలు ఉన్నాయంటూ ఆ యువకుడు సిబ్బందికి చెల్లించాడు. కానీ వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందేనని ప్రయివేటు ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. తన వద్ద లేవని చెప్పడంతో వారు వేసిన కుట్లను తిరిగి విప్పేసి దారుణంగా వ్యవహరించారు. బైకు పై నుంచికింద పడటంతో గాయాలయిన యువకుడు తొలుత ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లాడు.

మూడు వందలు చెల్లించినా...?
యువకుడు కన్సల్టేషన్ ఫీజు కింద మూడు వందల రూపాయలు చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు.. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. అనంతరం యువకుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తిరిగి కుట్లువేయంచుకున్నారు.


Tags:    

Similar News