ఖమ్మం రైతులను ఆదుకోరా? : హరీశ్‌రావు

తెలంగాణలో ఖమ్మం జిల్లా రైతులకు సాగు నీరందించకుండా ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు;

Update: 2024-09-23 06:55 GMT
harish rao, brs, another case,  bachupalli police
  • whatsapp icon

తెలంగాణలో ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరందించకుండా ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వమే ఖమ్మంలో ఉందని చెప్పుకునే మంత్రులకే రైతులకు నీళ్లు ఇవ్వడం చేతకావడం లేదంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు.

ఎకరానికి పాతికవేలు...
రైతుబంధు, రుణమాఫీ ఇవ్వడం లేదని, వరదల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. చివరికి మిగిలిన పంటలకు కూడా సాగు నీరు ఇవ్వడం లేదని హరీశ్ రావు విమర్శలు చేశారు.సాగర్ ఆయకట్టు పంటలకు నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఆయకట్టు రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.


Tags:    

Similar News