Breaking : ఓటమి తర్వాత కేటీఆర్ ఫస్ట్ కామెంట్స్.. ఏంటంటే?

పదేళ్లు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపామని, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు

Update: 2023-12-03 12:40 GMT

ktr

గత పదేళ్లు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపామని, అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆశించిన ఫలితాలు రాకపోవడం నిరాశకలిగించిందన్నారు. గతం కంటే మెజారిటీ వస్తుందని భావించామని, అయితే ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. 119 స్థానాల్లో 39 నియోజకర్గాల్లో బీఆర్ఎస్ గెలిచిందని అన్నారు. సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేటీఆర్ తెలిపారు. వంద శాతం ప్రజల గొంతుకై వ్యవహరిస్తామని తెలిపారు.

మళ్లీ వేగంగా...
తమకు అడుగడుగునా అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ బాధపడాల్సిన పనిలేదన్నారు. ఎవరూ ఉద్విగ్నతకు గురి కావద్దని అన్నారు. వేగంగా కొట్టిన బంతి తిరిగి ఎంత వేగంగా పైకి లేస్తుందో అంతే వేగంగా పైకి వస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈరోజు అవకాశమిచ్చారని, వారికి తమ అభినందనలు చెప్పారు. తమ పార్టీ నుంచి సహకారం ఉంటుందని తెలిపారు. వెంటనే ప్రభుత్వాన్ని తొందరపెట్టబోమని, ప్రజలకు ఇచ్చిన హామీలను వారు నిలబెట్టుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.


Tags:    

Similar News