Telangana : రైతు రుణమాఫీ యాభై శాతం మందికీ కాలేదు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలకు చేసేందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు

Update: 2024-12-08 06:48 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలకు చేసేందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రగతి మసకబారిందని చెప్పారు. ఏడాది పాలన - ఎడతెగని వంచన పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు. ఏ గ్రామంలో చూసినా యాభై శాతం మందికి కూడా రెండు లక్షల రుణమాఫీ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆందోళన చేయని వర్గమంటూ ఏదైనా ఉందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

రోడ్డెక్కని రంగేమేదీ?
చివరకు ముగ్గురు మంత్రులున్నప్పటికీ ఖమ్మం వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ఏడాది పాలనంతా అశాంతి, అరాచకంతోనే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో మత కలహాలు జరిగాయన్న హరీశ్ రావు హైడ్రా పేరుతో కూల్చివతేలను ప్రారంభించి అలజడి సృష్టించారన్నారు. మద్యం విక్రయాలు పెంచడానికి అడ్డదారులు వెతుకుతున్నారని, రేవంత్ రెడ్డి దేవుళ్లను మోసం చేసినందుకే భూకంపం వచ్చిందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News