Breaking : కేటీఆర్ కేసులో ఈడీ ఎంట్రీ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదయిన కేసు వివరాలను ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదయిన కేసు వివరాలను ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు కోరారు. ఈ మేరకు తెలంగాణ ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదయిన వివరాలను తమకు తెలపాలని, హెచ్ఎండీఏ నిధుల నుంచి ఏ అకౌంట్ కు నిధులు బదిలీ అయ్యేయో తదితర వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా పంపాలని ఈడీ కోరింది.
లావాదేవీలు జరిగిన తేదీలు...
లావాదేవీలు జరిగిన తేదీ వివరాలతో పాటు దానకిశోర్ ఫిర్యాదు కాపీని కూడా పంపాలని ఈడీ అధికారులు కోరారు. ఎంతమొత్తం బదిలీ అయిందో తెలియజేయాలని ఈడీ అధికారులు ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు కు సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారన్న ఆరోపణలపై ఈడీ వివరాలు కోరింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ