లగచర్ల రైతులు జైలు నుంచి బయటకు

సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతులు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు

Update: 2024-12-20 03:11 GMT

సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతులు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో గత 37 రోజులుగా జైలులో ఉన్న రైతులకు బెయిల్ లభించింది. అయితే నిన్న బెయిల్ పేపర్లు అందడంతో ఆలస్యం కావడంతో నిన్న విడుదల కాలేదు. ఈరోజు ఉదయం లగచర్లకు చెందిన పదిహేడు మంది రైతులు విడుదలయ్యారు.

బెయిల్ రావడంతో...
జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న లగచర్ల రైతులు గత ముప్ఫయి ఏడు రోజుల నుంచి జైలులోనే ఉండటంతో వారు బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో వీరు అరెస్ట్ కావడంతో జైలులోనే ఉన్నారు. వీరిలో పదిహేడు మంది రైతులు మాత్రం నేడు విడుదలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.


Tags:    

Similar News