సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే రేఖా నాయక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు కీలక నిర్ణయాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆశించిన పార్టీలలో సీట్లు దక్కకపోవడంతో పార్టీలు మారే వారు కొంతమంది అయితే.. ఇండిపెండ్ గా గెలుస్తామనే ధీమాలో ఉన్న వ్యక్తులు మరికొందరు. ఆ కోవలోకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చేరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెకు టికెట్ ప్రకటించకపోవడంతో ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఆమె గుడ్ బై చెప్పారు. రాజీనామాపై రేపు ప్రకటన చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆమె అన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని భావించారు. అయితే ఆ పార్టీ నుండి రేఖా నాయక్ ఆశించిన స్పందన రాలేదు. పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. గత కొద్దిరోజులుగా తన అనుచరులతో చర్చలు జరిపిన రేఖా నాయక్ చివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.