KTR : నేడు తెలంగాణ భవన్ కు కేటీఆర్
నేడు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమం తెలంగాణ భవన్ లో జరగనుంది. కేటీఆర్ హాజరు కానున్నారు;

KTR
నేడు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమం తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈకార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగానికి చెందిన క్యాలెండర్ ను కేటీఆర్ విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీఆర్ఎస్వీని...
బీఆర్ఎస్వీని మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యమించడానికి విద్యార్ధి విభాగాన్ని మరింత శక్తిమంతం చేసి ఎన్నికల నాటికి మరింతగా పార్టీని జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్వీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.